Share News

Murusu ‘ మురసు’ గుబులు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:29 PM

“The Murusu’s Echo” ‘మురసు’ తుఫాన్‌ ప్రభావంతో సోమవారం మన్యంలో వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమవగా.. పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. మంగళవారం జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అర్నబ్‌ తుఫాన్‌ దెబ్బ నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో తుఫాన్‌ భయం వారిని వెంటాడుతోంది.

 Murusu ‘ మురసు’ గుబులు
కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట

పాలకొండ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘మురసు’ తుఫాన్‌ ప్రభావంతో సోమవారం మన్యంలో వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమవగా.. పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. మంగళవారం జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అర్నబ్‌ తుఫాన్‌ దెబ్బ నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో తుఫాన్‌ భయం వారిని వెంటాడుతోంది. వాస్తవంగా ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో అన్నదాతలు సాగునీటి కష్టాలు ఎదుర్కొని సుమారు 80 వేల హెక్టార్లలో వరి పండించారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ దశలో వరుస తుపాన్లు రైతులను కలవర పెడుతున్నాయి. ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు ముంపునకు గురై దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే పొలాల నుంచి వరదనీరు మరులుతుంది. అయితే ఈ సమయంలో మరో తుఫాన్‌ ప్రకటన రైతులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తే ఖరీఫ్‌ పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:29 PM