Share News

మిస్టరీగా మారిన వివాహిత హత్య

ABN , Publish Date - May 06 , 2026 | 12:12 AM

రాజాం మున్సిపాలి టీ పరిధిలోని డోలపేటలో ఈనెల 4న జరిగిన వివాహిత స్పందన హత్య పొలీసులకు సవాల్‌గా మారింది.

మిస్టరీగా మారిన వివాహిత హత్య

  • ఆచూకీ లేని మృతురాలి కుమారుడు

రాజాం రూరల్‌, మే 5(ఆం ధ్రజ్యోతి): రాజాం మున్సిపాలి టీ పరిధిలోని డోలపేటలో ఈనెల 4న జరిగిన వివాహిత స్పందన హత్య పొలీసులకు సవాల్‌గా మారింది. మృతురా లి శరీరంపై ఉన్న గాయాలు, ఇంట్లో కనిపిస్తున్న పరిస్థితు లు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం స్పందన హత్యకు గురైనట్లు పొలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయినా హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది మిస్టరీగా మారింది. ప్రధానంగా మృతురాలి కుమారుడు శుశాంత్‌ ఆచూకీ లభ్యం కావడం లేదు. బీరువాలోని రూ.5వేల నగ దు, సుమారు పది తు లాల బంగారంతో పాటు ఆమె మొబైల్‌, చార్జర్‌ కూడా కనిపించడం లేదు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు మంగళవారం ఘటనా స్థలా న్ని, రాజాం ఏరియా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. ఇదిలాఉంటే హత్య జరిగిన రోజంతా స్పందన కుమారుడి వద్ద ఉన్న మొబైల్‌ స్విచ్చాఫ్‌ కాగా, మంగళవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నట్టు పొలీసులు గుర్తించారు. శుశాంత్‌ ఆచూకీ లభ్యం అయితే కేసు చిక్కుముడి సులభంగా వీడుతుందని పొలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ వెంట సీఐలు శ్రీనివాసరావు, ఉపేంద్ర ఉన్నారు.

అసలేం జరిగిందంటే...

పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ముంజేటి సతీష్‌ సోమవారం విధులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి భార్య స్పందన లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో స్పందన తల్లి ఉమ.. తన కుమార్తెకు కాల్‌ చేస్తే మనుమడు శుశాంత్‌ లిఫ్ట్‌ చేశాడు. ఆపై ఎన్ని సార్లు కాల్‌చేసినా మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కాగా సాయం త్రం సతీష్‌ ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు, లోపల బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. భార్య కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్‌.. బీరువాలోని నగదు, బంగారం పోయిందని నిర్ధారణకు వచ్చి, భార్య కోసం వెతకడం ప్రారంభిం చాడు. ఇంటి వెనుకభాగంలో ముళ్లపొదల సమీపంలో భార్య స్పందన రక్తంతో కూడిన గాయాలతో విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించి, పొలీసులకు సమాచా రం అందించారు. మృతురాలి తల్లి ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

శుశాంత్‌ కోసం గాలిస్తున్నాం..

స్పందన హత్యకు సంబంధించి ఆచూకీ లేని ఆమె కుమారుడు శుశాంత్‌ కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం. ఇప్పటికే ఐదు బృందాలను నియమించాం. శుశాంత్‌ దొరికితే కేసు చిక్కుముడి వీడుతుంది. మంగళవారం ఉదయం ఇన్‌స్టాగ్రాం ఆన్‌లైన్‌లో ఉన్నట్లు గుర్తించాం. త్వరలో పట్టుకుంటాం.

- రాఘవులు, డిఎస్పీ, చీపురుపల్లి

Updated Date - May 06 , 2026 | 12:12 AM