Share News

భరోసా ఇచ్చేవరకు ఉద్యమం ఆగదు

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:05 AM

సంకిలి ఈఐడీ ప్యారీ చెక్కర కార్మగారం క్రషింగ్‌ను వచ్చే ఏడాది నిలుపుదల చేస్తున్న ప్రకటనను యాజమాన్యం తక్షణ మే విరమించుకోవాలని, దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు చెరుకు రైతులు ఉద్యమం ఆగదని చెరుకు పరిరక్షణ కమిటీ బృందం.. సంకిలి ఈఐడీ ప్యారీ యాజమాన్యం బోర్డు అఫ్‌ డైరెక్టర్‌ సిబ్బందికి తెగేసి చెప్పింది.

భరోసా ఇచ్చేవరకు ఉద్యమం ఆగదు

  • షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులతో పరిరక్షణ కమిటీ చర్చలు

  • ఎటూతేలని నిర్ణయం

రేగిడి, అక్టొబరు8(ఆంధ్రజ్యోతి): సంకిలి ఈఐడీ ప్యారీ చెక్కర కార్మగారం క్రషింగ్‌ను వచ్చే ఏడాది నిలుపుదల చేస్తున్న ప్రకటనను యాజమాన్యం తక్షణ మే విరమించుకోవాలని, దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు చెరుకు రైతులు ఉద్యమం ఆగదని చెరుకు పరిరక్షణ కమిటీ బృందం.. సంకిలి ఈఐడీ ప్యారీ యాజమాన్యం బోర్డు అఫ్‌ డైరెక్టర్‌ సిబ్బందికి తెగేసి చెప్పింది. ఇటీవల నిర్వహించిన ధర్నా, నిరసన ర్యాలీల నేపథ్యంలో గురువారం స్థానిక కర్మాగార చాంబర్‌లో యాజమాన్యం ప్రతినిఽధులు ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీతో చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో యాజమాన్యం తరపున ఈఐడీ ప్యారీ మాన్‌ఫ్యాక్చరింగ్‌ హెడ్‌ బాలజీ, స్థానిక జీఏ వెంకట్‌ సూర్యతేజ్‌ హాజరు కాగా, పరిరక్షణ కమిటీ ప్రతిని ధులైన ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, ప్రతినిధులు కింజరాపు సురేష్‌, కిమిడి సూరపనాయుడు, తదితర 20 మంది చెరుకు రైతులు హాజరయ్యారు. ముందుగా ఫ్యాక్టరీ ప్రతినిధులు మాట్లాడుతూ క్రషింగ్‌ నిలుపుదల ప్రకటనకు గల కారణాలను వివరించారు. ఎదేమైనా సరైన భరోసా ఇచ్చేవరకు తమ ఉద్యమం ఆగదని, ఫ్యాక్టరీ లేనప్పుడు, డిస్టలరీ ప్లాంట్‌లు తమకొద్దని పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెగేసిచెప్పారు. గతంలో వలే చెరుకు సాగుకు రాయితీలు, ప్లాంటేషన్‌కు అవ సరమైన కేన్‌ స్టాఫ్‌, అవసరమైన కేన్‌ కార్యాలయాలు ఉంటే చెరుకు సాగుకు రైతులు మందుకు వస్తారని పరిరక్షణ బృందం తెలిపారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ.. పరిరక్షణ కమిటీ వాదన లను బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లి, నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. మరోసారి రైతులతో కూ ర్చుంటామని చెప్పారు. ఈ చర్చల్లో రేగిడి, పాలకొండ, వీరఘట్టాం, సంతకవిటి తదితర మండలాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:05 AM