Share News

ఉద్యమమే శరణ్యం

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:32 AM

తమ సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఉద్యమమే శరణ్యమని ఏపీ జేఏసీ అమరావతి ఉపాధ్య క్షుడు చింత బంగార్రాజు అన్నారు.

ఉద్యమమే శరణ్యం

  • ఏపీ జేఏసీ అమరావతి ఉపాధ్యక్షుడు బంగార్రాజు

విజయనగరం కంటోన్మెంట్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఉద్యమమే శరణ్యమని ఏపీ జేఏసీ అమరావతి ఉపాధ్య క్షుడు చింత బంగార్రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ హోంలో గురువారం జరిగిన ఉద్యమ కార్యచ రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ స్యల సాధనకు రాష్ట్ర కార్యవర్గం ప్రకటించే కార్యాచ రణకు ఉద్యోగులంతా మద్దతుగా నిలవాలని పిలుపుని చ్చారు. తక్షణమే వేతన సవరణలు ప్రకటించాలన్నా రు. కమిషనర్‌ను నియమించిన వెంటనే సిఫార్సులు అందిం చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థి తుల్లో మధ్యంతర బృతిని ప్రక టించాలని డిమాండ్‌ చేశారు. అన్ని రకాల పెండింగ్‌ బకాయి లు చెల్లించాలని, కాంట్రాక్టు, పొ రుగుసేవలు ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పింఛన్లు పునరుద్ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న రెండేళ్ల చైల్డ్‌కేర్‌ లీవ్‌ను రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా వర్తింపజేయాల ని బంగార్రాజు విజ్ఞప్తి చేశారు. సరెండర్‌ లీవులు ఎప్పటికప్పుడు చెలించాలని, పెండింగ్‌ డీఏలను తక్షణ మే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ మహిళా విభాగం చైర్మన్‌ పి.ఆదిలక్ష్మి, రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉప ప్రధాన కార్యదర్శి పెంట భానుమూర్తి, జిల్లా కార్యదర్శి ఎస్‌.రామకృష్ట, సహాధ్యక్షు డు పి.సాయి కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:32 AM