పాలజంగిడిని మోసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:18 AM
పట్టణంలో కొత్తపోలమ్మ ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం సాయంత్రం పాలజంగిడి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
బెలగాం, ఏప్రిల్ 24 (ఆంధ్ర జ్యోతి): పట్టణంలో కొత్తపోలమ్మ ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం సాయంత్రం పాలజంగిడి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొని అమ్మవారి పాలజంగిడిని మోశారు. అంతకు ముందు పెద్దవీధిలో అమ్మ వారి ఆలయాన్ని సందర్శించి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.