Share News

మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:15 AM

అమరావతిలో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఎమ్మెల్యే బేబీనాయన, ఏఎంసీ చైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు కలిశారు.

మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన ఎమ్మెల్యే
మంత్రితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, జనవరి6 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఎమ్మెల్యే బేబీనాయన, ఏఎంసీ చైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో నూతన గోదాములు, కాంపౌండ్‌ వాల్‌, వాణిజ్య సముదాయం నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయాలని విన్నవించారు. నియోజకవర్గ పరిధిలో వెటర్నరీ ఆసుపత్రి భవనాలన్నీ శిథిలావస్ధలో ఉన్నాయని, తెర్లాం మండలం నెమలాం ఆసుపత్రి భవనం అత్యంత ప్రమాదకరంగా తయారైందని వివరించారు. పాత భవనాల స్థానంలో కొత్త భవనాలను మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుదు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట తెర్లాం మండల టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేశ్‌, మండల నాయకులు రెడ్డి శంకరరావు, మర్రాపు యుగంధర్‌ ఉన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 12:15 AM