Share News

మారిక పాఠశాల భవనం పూర్తిచేయాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:52 PM

మండలంలోని మారిక గిరిజన గ్రామంలో పాఠ శాల భవనం మంజూరుచేసి నిర్మాణం పూర్తిచేయాలని ఏపీ రైతు సంఘం నాయకుడు చల్లా జగన్‌, గ్రామస్థులు కోరారు.

మారిక పాఠశాల భవనం పూర్తిచేయాలి
నిరసన తెలుపుతున్న మారిక గిరిజనులు :

వేపాడ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారిక గిరిజన గ్రామంలో పాఠ శాల భవనం మంజూరుచేసి నిర్మాణం పూర్తిచేయాలని ఏపీ రైతు సంఘం నాయకుడు చల్లా జగన్‌, గ్రామస్థులు కోరారు. ఈమేరకు వేపాడలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద మంగళవారంమారిక గిరిజనులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో గమ్మెల బా బూరావు, జలారి వీర్రాజు, శోభనబాబు, కిల్లో కృష్ణ, మర్రి రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:52 PM