The majestic elephants have returned. మళ్లీ వచ్చిన గజరాజులు
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:22 AM
The majestic elephants have returned. గజరాజులు మళ్లీ బాడంగి మండలం వైపు వచ్చాయి. నాలుగు రోజుల క్రితం తెర్లాం మండలం నందబలగ నుంచి పినపెంకి వైపుగా సంచరించి బాడంగి మండలం వైపు వచ్చాయి. అక్కడి నుంచి బొబ్బిలి మండలానికి తరలివెళ్లి రెండు రోజులుగా పినపెంకి, రేజేరు కోటిపల్లి మీదుగా గురువారం ఆకులకట్ట గ్రామానికి చేరుకున్నాయి.
మళ్లీ వచ్చిన గజరాజులు
ఆకులకట్ట తోటల్లో తిష్ఠ
బాడంగి, జూలై 23(ఆంధ్రజ్యోతి): గజరాజులు మళ్లీ బాడంగి మండలం వైపు వచ్చాయి. నాలుగు రోజుల క్రితం తెర్లాం మండలం నందబలగ నుంచి పినపెంకి వైపుగా సంచరించి బాడంగి మండలం వైపు వచ్చాయి. అక్కడి నుంచి బొబ్బిలి మండలానికి తరలివెళ్లి రెండు రోజులుగా పినపెంకి, రేజేరు కోటిపల్లి మీదుగా గురువారం ఆకులకట్ట గ్రామానికి చేరుకున్నాయి. రామభద్రపురం-రాజాం వెళ్లే హైవేరోడ్డులో గురువారం ఉదయం నుంచి రోడ్డుకు ఇటు, అటు తిరుగుతూ చివరకు ఆకులకట్టలోని రహదారి పక్కన మామిడి తోటలోకి వెళ్లాయి. ఫారెస్టు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏనుగుల దగ్గరకు వెళ్లవద్దని, వాటి వద్ద ఎటువంటి ఫొటోలుగానీ, శబ్దాలుగానీ చేయవద్దని ముఖ్యంగా యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఆకులకట్టకు గజరాజులు తిరిగి రావడంతో ఆ గ్రామంతోపాటు పరిసర గ్రామాలైన కూనాయవలస, రామచంద్రపురం, మల్లంపేట, దత్తి వెంకంపేట గ్రామాలకు చెందిన రైతులు భయాందోళన చెందుతున్నారు.