పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:46 PM
జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత సంబంధిత అధికారులను ఆదేశించారు.
- జిల్లా రెవెన్యూ అధికారి హేమలత
పార్వతీపురం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై డీఆర్వో అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. జిల్లాలో 33 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5,446 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సకాలంలో ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. ప్రథమ చికిత్స శిబిరాలు ఉండాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ అంతరాయం ఉండరాదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.