Share News

గాయపడిన యువకుడి పరిస్థితి విషమం

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:12 AM

ఎస్‌.కోట సంజీవని ఆసుపత్రి వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.

  గాయపడిన యువకుడి పరిస్థితి విషమం

శృంగవరపుకోట, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఎస్‌.కోట సంజీవని ఆసుపత్రి వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమ యం నుంచి సాయంత్రం వరకు జనం గుమికూడారు. వివరాలిలా ఉన్నాయి. కిల్తంపాలెం పంచాయతీ శివారు రాయివానిపాలెంలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్‌ స్తంభం ఎక్కిన భాను అనే యువకుడు ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న సంజీవని ఆసుపత్రిలో చేర్చారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే శనివారం నాటికి పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న బంధువులతో పాటు గ్రామానికి చెందిన స్థానికులు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు తరలి వచ్చారు. యువకుని పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్టణం తరలించాలని వైద్యులు చెప్పారు. దీంతో కొంతమంది యువకులు యాజమాన్యాన్ని నిలదీ శారు. ముందుగానే పరిస్థితిని అంచనా వేసి, చెప్పాలి కదా.. అంటూ ప్రశ్నించా రు. తర్జనభర్జన అనంతరం విశాఖపట్టణం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Feb 15 , 2026 | 12:12 AM