Share News

గాయపడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:40 AM

మండలంలోని వెంకటరమణపేట గ్రామం వద్ద ఈనెల 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తాటిమూరు అప్పారావు(50) విజయనగరం మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

గాయపడిన వ్యక్తి మృతి

ఎస్‌.కోట రూరల్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటరమణపేట గ్రామం వద్ద ఈనెల 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తాటిమూరు అప్పారావు(50) విజయనగరం మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. ఈ ఘటనపై సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 5న వెంకటరమణపేట గ్రామానికి చెందిన అప్పారావు.. తమ గ్రామానికి చెందిన అప్పలచారి అనే వ్యక్తిని తన ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చోపెట్టుకుని ఎస్‌.కోట వైపు వస్తున్నారు. కొత్తూ రు గ్రామం వైపు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఐస్‌క్రీం బండిని ఢీకొ ట్టారు. ఈ ప్రమాదంలో అప్పారావు తలకు తీవ్రమైన గాయమైంది. ఎస్‌.కోట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం మహారాజా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు గురువారం మృతిచెందారు. మృ తుడి భార్య త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 13 , 2026 | 12:40 AM