Share News

‘డిపోల మూసివేత ఆలోచన మానుకోవాలి’

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:29 AM

రాష్ట్రంలో మొదటి విడతగా 250 విద్యుత్‌ బస్సులను మంజూరు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను పినాకిల్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించి 12 డిపోల మూసివేత ఆలోచనను మాను కోవాలని ఎన్‌ఎంయూనాయకులు డిమాండ్‌చేశారు.

 ‘డిపోల మూసివేత ఆలోచన మానుకోవాలి’
: డిపో ఎదుట నిరసన తెలుపుతున్న ఎన్‌ఎంయూ నాయకులు

పాలకొండ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొదటి విడతగా 250 విద్యుత్‌ బస్సులను మంజూరు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను పినాకిల్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించి 12 డిపోల మూసివేత ఆలోచనను మాను కోవాలని ఎన్‌ఎంయూనాయకులు డిమాండ్‌చేశారు. మంగళవారం పాలకొం డ ఆర్టీసీ డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూడిపో కార్యదర్శి వావిలపల్లి రాజేష్‌, నాయకులు డీజీరావు, పీఎల్‌ రావు, సుబ్బారావు, సంగమేషు, లక్ష్మీ, గ్యారేజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:29 AM