టిడ్కో కాలనీకి గ్రహణం వీడింది
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:18 PM
బొబ్బిలి పట్టణ పరిధి రామన్నదొరవలసలోని టిడ్కో గృహాలకు గ్రహణం వీడింది.
-రూ.11.46 కోట్లతో మౌలిక సదుపాయాలు
-జోరుగా సీసీ రోడ్లు, కాలువలు, తాగునీరు, విద్యుత్ పనులు
-డిసెంబరుల కల్లా లబ్ధిదారులకు అప్పగించేందుకు కసరత్తు
బొబ్బిలి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణ పరిధి రామన్నదొరవలసలోని టిడ్కో గృహాలకు గ్రహణం వీడింది. రూ.11.46కోట్లతో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, తాగునీటి సరఫరా పనులు, విద్యుత్ సౌకర్యం వంటి పనులు జోరుగా జరుగుతు న్నాయి. డిసెంబరు కల్లా లబ్ధిదారులకు అప్పగిం చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బొబ్బిలి పట్టణా నికి సంబంధించి రామన్నదొరవలసలో 51 బ్లాకుల్లో 1,680 గృహాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరు వాత టిడ్కో గృహాలకు గ్రహణం పట్టింది. ఈ ఇళ్లను పక్కనపెట్టేసి జగనన్న కాలనీలను ఆ ప్రభుత్వం తెరమీదకి తెచ్చింది. వైసీపీ పుణ్యమా అని రామ న్నదొరవలసలో 16బ్లాకుల్లో 768 టిడ్కో ఇళ్ల పను లు పూర్తిగా రద్దయ్యాయి. 2024లో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో పనుల ను ప్రారంభించడానికి దాదాపు రెండేళ్ల కాలం పట్టింది. వైసీపీ హయాంలో రద్దయిన ఇళ్లకు సం బంధించి ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణ యం తీసుకోలేదు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి మౌలిక సదుపాయాలను కల్పించే పనులను రెండు నిర్మాణ సంస్థలకు అప్పగించింది. ఇందులో ఒక కంపెనీ 1248 ఇళ్లను పూర్తి చేసింది. రెండో కంపెనీ ఆధ్వర్యంలో 432 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జూన్, జూలై కల్లా తొలుత ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ప్పటికీ ఆ గడువు దాటిపోయింది. ఇప్పుడు డిసెం బరు కల్లా ఈకాలనీలను అప్పగించేందుకు చకచకా పనులు జరుపుతున్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
బొబ్బిలి టిడ్కో కాలనీలో రూ.7 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయి. 60 శాతం సీసీ కాలువలు, 30 శాతం సీసీ రోడ్లు పనులు ఇంతవరకు జరిగాయి. 15 బోర్ల ద్వారా రెండు తాగునీటి రిజర్వాయర్లకు 5 కేఎల్‌డీ నీటిని సరఫరా చేసే పనులు, మురుగునీటి ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. విద్యుత్ సంబంధిత పనుల కోసం రూ.4.6 కోట్ల మంజూర య్యాయి. ఆ పనులకు శ్రీకారం చుట్టాం. డిసెంబరు నాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
-పి.శ్రీరామ్మూర్తి, ఈఈ, టిడ్కో కాలనీ