దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:25 AM
aa
ఫజిల్లా ఎన్‌సీడీ పీవో జగన్మోహన్‌రావు
పార్వతీపురం రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యో తి): దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ఆరోగ్యాన్ని ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జిల్లా ఎన్‌సీడీ పీవో టి.జగన్మోహ న్‌రావు సూచించారు. శనివారం చినబొండపల్లిలో నిర్వహిస్తున్న సంచార వైద్య శిబిరాన్ని తనిఖీచేసి బీపీ, సుగర్ రోగుల వివరాలు, పరీక్షలు, ఆన్‌లైన్ నమోదు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేలా సిబ్బంది గృహ సందర్శనలు చేయాలని సూచించారు. కార్యక్రమం లో ఎన్‌సీడీ డీఈవో తాజ్, వైద్య సిబ్బంది పద్మ, లక్ష్మీ, 104 డీఈవో శివ పాల్గొన్నారు.