ముదిరిన డంపింగ్‌యార్డు సమస్య
ABN , Publish Date - May 26 , 2026 | 11:56 PM
కొత్తవలస డంపింగ్‌యార్డు సమస్య చినికిచినికి గాలి వానలా మారింది.
అధికారులను అడ్డుకున్న రాజన్న కాలనీవాసులు
చెత్తబండిని తిరిగి పంపేసిన వైనం
లక్కవరపుకోట(కొత్తవలస), మే 26(ఆంధ్రజ్యోతి): కొత్తవలస డంపింగ్‌యార్డు సమస్య చినికిచినికి గాలి వానలా మారింది. మంగళవారం రాజన్నకాలనీవాసులు జనసేన పార్టీ నాయకులతో కలిసి అక్కడకు వచ్చిన అధికారులను అడ్డుకుని చెత్తతో వచ్చిన ట్రాక్టర్‌ను తిరిగి పంపించేశారు. 56 రోజులుగా డంపింగ్‌యార్డుపై నిరస న తెలిపినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ డంపింగ్‌యార్డు నిర్వ హిస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీడీవో, పంచాయతీ ఈవోలతో కలిసిన అధికారుల బృందం డంపింగ్‌యార్డు వద్దకు చేరుకుని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇప్పటికే స్థానిక తహసీల్దార్ ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిం చినా.. జిల్లా అధికా రులు మొండిగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడు కుంటున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వబ్బిన సన్యాసినాయుడు మండి పడ్డారు. డంపింగ్ యార్డు ఇక్కడ నుంచి తరలించే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. చేసేదిలేక అక్కడ నుంచి అధికారుల వెనుదిరిగారు.
రాజన్నకాలనీ వద్ద గల డంపింగ్ యార్డ్ చెత్తను మొత్తం ప్రోససింగ్ చేసి.. కాలుష్యం లేకుండా చేస్తామని డీపీవో మల్లికార్జునరావు తెలిపారు. జడ్పీ సీఈవో నాగ మణితో కలిసి ఆయన ప్రజలకు వివరణ ఇచ్చారు.