పేదింట పెను విషాదం
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:16 AM
ఓ పేద కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.
గ్యాస్ వెలిగించే క్రమంలో అగ్నిప్రమాదం
మహిళ మృతి
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఓ పేద కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. పక్క ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్ అమర్చి, స్టౌవ్ వెలిగించే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఈ విషాద ఘటన నగరంలోని హుకుంపేటనూరు జంక్షన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హుకుంపేట జంక్షన్‌లో నివశిస్తున్న డి.భవానీ (31) అనే మహిళ.. మంగళవారం ఉదయం పక్కఇంట్లోని ఓ వృద్ధురాలి కోసం గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్ అమర్చి, స్టౌవ్ వెలిగించే క్రమంలో మంటలు వ్యా పించాయి. ఒక్కసారిగా భవానీకి అంటుకున్నాయి. క్షణాల్లోనే ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన అక్కడ వారందరినీ కంటతడి పెట్టించింది. సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకు న్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. టూటౌన్ పోలీసులు ఈ కేసును నమోదు చేసి, మృతురాలి భర్త ప్రభు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కృష్ణ మూర్తి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేసినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. భవానీ భర్త ప్రభు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భవానీ ఘోషాసుపత్రి ప్రాంగణంలో కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నది. వీరికి శ్యామ్, సంజయ్ అనే ఇద్దరు కుమారులు. ఒకరు ఆరో తరగతి, ఇంకొకరు ఐదవ తరగతి చదువుతున్నారు. ఏడాదిన్నర కిందట ఈ కుటుంబం విజయవాడలో ఉండే వారు. అక్కడ వరదలు అనంతరం జీవనం కష్టం కావడంతో కన్నవారి ఊరైనా విజయనగరం వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.