Share News

మహనీయుడు సంజీవయ్య

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:15 AM

సా మాన్య కుటుంబంలో జన్మించి తన ప్రతిభా సామర్థ్యా లతో ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయుడు దామో దర్‌ సంజీవయ్య అని ఎస్పీ దామోదర్‌ అన్నారు.

మహనీయుడు సంజీవయ్య

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): సా మాన్య కుటుంబంలో జన్మించి తన ప్రతిభా సామర్థ్యా లతో ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయుడు దామో దర్‌ సంజీవయ్య అని ఎస్పీ దామోదర్‌ అన్నారు. సం జీవయ్య జయంతి సందర్భంగా శనివారం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి, నివాళులు ఆర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ము ఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత నా యకుడిగా సంజీవయ్య చరిత్ర సృష్టించారని ఎస్పీ అన్నారు.

విజయనగరం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్‌ సంజీవయ్య జయంతి ఉత్స వాలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈసందర్భం గా సంజీవయ్య చిత్రపటానికి జేసీ సేతుమాధవన్‌ పూలమాల వేసి, నివాళులు అర్పించారు. సోషల్‌ వెల్ఫే ర్‌ డీడీ అన్నపూర్ణ, హౌసింగ్‌ పీడీ మురళీమోహన్‌, మా ర్క్‌ఫెడ్‌ డీఎం మేనేజరు వెంకటేశ్వరరావు ఉన్నారు.

శృంగవరపుకోట, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్‌ సంజీవయ్య పేరును కర్నూ లు జిల్లాకు పెట్టాలని దళిత మహాసభ జిల్లా అధ్యక్షు డు గంటాన అప్పారావు డిమాండ్‌చేశారు. శనివారం ఎస్‌.కోటలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అంబేడ్కర్‌ విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో సంజీవయ్య జయంతిని నిర్వహించారు. దళిత సంఘాల ప్రతినిధులు ఆతవ ఉదయ్‌బాస్కర్‌, డోల కేశవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:15 AM