Share News

మహనీయుడు ఓబన్న

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:52 PM

స్వా తంత్య్ర సమరంలో బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అని ఏఆర్‌ డీఎస్పీ కోటిరెడ్డి కొనియాడారు.

మహనీయుడు ఓబన్న

విజయనగరం క్రైం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): స్వా తంత్య్ర సమరంలో బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అని ఏఆర్‌ డీఎస్పీ కోటిరెడ్డి కొనియాడారు. వడ్డే ఓబన్న జ యంతి సందర్భంగా ఆదివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఆర్‌ఐ గోపాలనాయుడు, అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా కార్యా లయంలో వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వ హించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌ వర్మ ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దొగ్గా దేవుడు, దేవర ఉదయకిరణ్‌, టి.అప్పలనాయుడు పాల్గొన్నారు.

విజయనగరం, కలెక్టరేట్‌, జనవరి 11(ఆంధ్ర జ్యోతి): వడ్డే ఓబన్న జయంతి వేడుకులను స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జె.జ్యోతిశ్రీ పాల్గొని, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. సహాయ వెనుకబడిన తరగతులు సంక్షేమాధికారులు రాజుల మ్మ, కృష్ణ , శ్యామ్‌లకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:52 PM