పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:23 AM
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు లు తెలిపారు.
పీ-4 పథకానికి ఏడాది
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు లు తెలిపారు. పీ-4 కార్యక్రమానికి సోమవారంతో ఏడాది పూర్తి కావడంతో జిల్లా అంతటా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో వారు పాల్గొని, మాట్లాడారు. ఇప్పటికే చాలా బంగారు కుటుంబాలను గుర్తించగా, వాటిలో కొన్నింటిని మార్గదర్శులు దత్తత తీసుకున్నారని చెప్పారు. ఇంకా మిగతా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
(ఆంధ్రజ్యోతి బృంందం)