ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:09 AM
యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచే స్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.
ఎమ్మెల్యే నాగమాధవి
డెంకాడ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచే స్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. మంగ ళవారం డెంకాడలోని ఎస్సీ కాలనీలో ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక అధికారుల ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే లోకం నాగమాధ వి, విద్యుత్ శాఖ సీఎండీ పృథ్వితేజ్ పాల్గొని, మాట్లా డారు. అనంతరం గృహాలపై ఏర్పాటుచేసిన సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్స్‌ను ప్రారంభించారు. ఎంపీపీ వాసు దేవరావు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, ఏపీ ఈపీడీసీఎస్ పర్యవేక్షక ఇంజనీర్ లక్ష్మణరావు, ఈఈ మాదవ నాయుడు, ఏఈ అప్పలస్వామినాయుడు, జనసేన నాయకుడు తుమ్మి లక్ష్మీరాజ్ పాల్గొన్నారు.