రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:24 AM
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
ఎస్.కోట ఎమ్మెల్యే లలితకుమారి
కొత్తవలస, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కొత్తవలస, వేపాడ, లక్కవరపపుకోట, శృంగవరపుకోట, జామి మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యా శాఖాధికారులతో మరికొన్ని శాఖల అధికారులతో మండల ప్రత్యేకాధికారి మురళి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆమె బడ్జెట్ అవుట్ రీచ్‌పై సమీక్షించారు. శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధి, స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌పై వివిధశాఖల అధికారులతో ప్రతిఅంశంపై చర్చించారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై చర్చించారు. 2025-26 సంవత్సరంలో నియోజకవర్గంలో వెచ్చించిన నిధులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో దాసరి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, అధికారులు పాల్గొన్నారు. అలాగే కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే లలితకుమారి గురువారం పరిశీలించారు. భోజనం రుచిగా ఉందా.. మెనూ పాటిస్తున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు.