పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:07 AM
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు.
ఎమ్మెల్యే అదితి
విజయనగరం రూరల్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. తాను దత్తత తీసుకున్న మండల పరిధిలోని మలిచర్ల, సుంకరిపేట గ్రామాల్లో మంగళ వారం ఆమె ఉచిత వైద్య శిబిరా న్ని ఏర్పాటు చేయించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. ఈ శిబిరంలో భాగంగా నేత్ర, గుండె, క్యాన్సర్ వంటి వైద్య పరీక్షలు నిర్వహిం చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.