ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:29 AM
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
ఎస్.కోట ఎమ్మెల్యే లలితకుమారి
తాటిపూడి గురుకుల పాఠశాల విద్యార్థినులకు పరామర్శ
శృంగవరపుకోట, జూలై 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. వైరల్ జ్వరాలతో బాధపడుతున్న తాటిపూడి గురుకుల కళాశాల విద్యార్థినులను ఆమె గురువారం పరామర్శించారు. 51 మంది విద్యార్థినులకు అస్వస్థత అని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమై వార్తకు ఆమె స్పందించారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులతో పాటు గురుకుల కళాశాలలో ఉంటున్న విద్యార్థినిలను కలిసి, వారితో మాట్లాడారు. జ్వారాలు వ్యాపించడానికి గల కారణాలను ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. టీడీపీ మండల అధ్యక్షుడు డోకుల చినఅచ్చంనాయుడు, నాయకు లు జీఎస్ నాయుడు, రెడ్డి వెంకన్న, రాయవరపు చంద్రశేఖర్, ఇందుకూరి శ్రీను రాజు తదితరులు పాల్గొన్నారు.