ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:01 AM
ప్రభుత్వ కళాశాల నిర్మాణాన్ని త్వరిగతిన పూర్తి చేయా లని ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు.
ఏపీ ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ శ్రీనివాసరావు
విజయనగరం రింగురోడ్డు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాల నిర్మాణాన్ని త్వరిగతిన పూర్తి చేయా లని ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జిల్లాలో ఆయన పర్యటించా రు. ముందుగా స్థానిక ఏపీఎంఎస్‌ఐడీసీ కార్యాలయా న్ని సందర్శించారు. అనంతరం వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణాల ప్రగతి, వి ద్యార్థులకు వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. సెంట్రల్ మెడికల్ స్టోర్, క్రిటికల్ కేర్ బ్లాక్‌లను తనిఖీ చేశారు. 108, 104 వాహనాలను పరిశీలించి వాటి పరిస్థితిని వాకబు చేశారు. వైద్య కళాశాల భవన నిర్మాణాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. హాస్టల్ భవనాలను పూర్తి చేసి విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాల ని సూచించారు. అవసరమైన మందులన్నీ అందుబా టులో ఉంచాలని, డ్రగ్ స్టోర్స్ సిబ్బందిని ఆదేశించారు. 108, 104 వాహనాలను అన్ని విధాలుగా సిద్ధంగా ఉంచి, ప్రజల కు సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట మెడికల్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా.సంజాదేవి, ఎంపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఎన్ భారతి, ఫార్మశీ అధికారి బి.సన్యాసినాయుడు, 108, 104 జిల్లా కో-ఆర్డినేటర్లు మన్మథనాయుడు, మూర్తి పాల్గొన్నారు.