సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:14 AM
రాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.
గరివిడి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి నుంచి గర్భాం వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ రోడ్డు సమస్యపై తాను ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి మొదటి విడతగా రూ.3కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అలాగే మరో రూ.3 కోట్లు కూడా త్వరలో మంజూరు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు, టీడీపీ మండల నాయకులు పైల బలరాం, బలగం వెంకటరావు, సారిపాక సురేష్‌కుమా ర్, నాలుగు మండలాల టీడీపీ నేతలు పాల్గొన్నారు.
వైసీపీని బ్యాన్ చేయాలి
వైసీపీని రాజకీయాల్లో లేకుండా ఎన్నికల కమిషన్ బ్యాన్ చేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోరారు. సోమవారం ఆయన గరివిడిలో విలేకర్లతో మాట్లాడారు. బూతులు మాట్లాడుతున్న వైసీపీ నేత అంబటి రాంబాబును ఆ పార్టీ వ్యవస్థాప కుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమర్ధిం చడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరి మితం చేసినా ఆ పార్టీకి బుద్ధి రాలేదన్నారు. ఇప్పటికై నా ఎన్నికల కమిషన్ కలుగజేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేయాలని ఆయన కోరారు.