స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:38 AM
జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేం దుకు వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పి స్తూ కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ కె.నాగబాబు పిలు పునిచ్చారు.
ఎమ్మెల్సీ నాగబాబు
పార్వతీపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేం దుకు వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పి స్తూ కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ కె.నాగబాబు పిలు పునిచ్చారు. మండలంలోని నర్సిపురంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం సా యంత్రం నాగబాబు విలేకరులతో మాట్లా డుతూ.. కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజ లు ఓటు వేశారని, వారి నమ్మకానికి అను గుణంగా రాష్ట్ర అభివృద్ధిని చేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. పర్యావరణం కాపాడుతూ పవన్క ల్యాణ్ గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాం తాలకు రహదారులు, తాగునీటి సదుపాయా న్ని కల్పిస్తున్నారని వెల్లడించారు. రంపచోడ వరం ప్రాంతంలో 300 మంది గిరిజనులు ఉన్న గ్రామాలకు రహదారి నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరు చేశామన్నారు. జన సేన కార్యకర్తలు చురుగ్గా ఉన్న ప్రాంతాల్లో వారిని ప్రోత్సహించేందుకు పార్టీ ద్వారా అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు ఎంతో చిత్తశుద్ధితో, అంకితభా వంతో పని చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎంతో నమ్మకం కలి గిందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో వందశాతం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17 నాటికి కూటమి పార్టీల స్థానాల సర్దుబాటు పూర్తవుతుందని, ఎవరు ఎక్కడ నుంచి పోటీచేస్తారో అన్నది స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు.