రెవెన్యూ సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - May 08 , 2026 | 12:33 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన వన్ మంత్ -వన్ విలేజ్- ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని మండలంలోని బెల్లాం గ్రామంలో గురువారం నిర్వహించారు.
ఎమ్మెల్యే నాగమాధవి
డెంకాడ, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన వన్ మంత్ -వన్ విలేజ్- ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని మండలంలోని బెల్లాం గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ఎమ్మెల్యే లోకం నాగమాధవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కార మే ధ్యేయంగా .. గ్రామాలను వివాద రహితంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమంపై గ్రామ ప్రజలందరికీ ముంద స్తు సమాచారం అందించడంలో విఫలమైనందున వీఆర్వో, వీడీవోలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.రాజారావు, సచివాలయ ప్రత్యేకాధికారి కర్రోతు రాజ్‌కుమార్, జొన్నాడ పీఏసీఎస్ అధ్యక్షులు భవిరిశెట్టి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, కూటమినాయుడు పాల్గొన్నారు.
సంతకవిటి, మే 7(ఆంధ్రజ్యోతి): ఎస్.అగ్రహారం గ్రామంలో గురువారం నిర్వహించిన ఒక నెల - ఒక గ్రామం కార్యక్రమానికి చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్ధానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అలాగే రీ-సర్వే పూర్తయిన ఈ గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాలను ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు.