Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:08 AM

సమస్యల పరిష్కారమే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.

 సమస్యల పరిష్కారమే ధ్యేయం
టీడీపీ కండువావేసి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర:

పార్వతీపురం రూరల్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారమే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మండలంలోని వెంకంపేట పంచాయతీ పరిధిలో గల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం మండలా లతో పాటు పార్వతీపురం పట్టణంలోని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిం చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిం చడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే పార్వతీపురం మండలంలోని బాల గొడబ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు మువ్వల పాదా లనాయుడు ఆధ్వర్యంలో చేరారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు బోను దేవీచంద్రమౌళి, కొప్పల వెలమకార్పొరేషన్‌ డైరెక్టర్‌ గొట్టాపు వెంకటనాయుడు, బాలగొడబకు చెందిన జయరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 12:08 AM