Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:02 AM

మునిసిపాలిటీలో అన్ని వార్డుల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం జగన్నాఽథపురం పరిధిలో గల 30వ వార్డులో పర్యటించారు.

 సమస్యల పరిష్కారమే ధ్యేయం
సమస్యలు వింటున్న ఎమ్మెల్యే విజయచంద్ర :

పార్వతీపురంటౌన్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో అన్ని వార్డుల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం జగన్నాఽథపురం పరిధిలో గల 30వ వార్డులో పర్యటించారు. వార్డులోని ఇంటింటికి తాగునీరు, పారి శుధ్య నిర్వహణతో పాటు కాలువల్లో పూడికలు తీయడంతో సీసీ రహదారి నిర్మాణ సమస్యల నుంచి తెలుసుకొన్నారు. మునిసిపాలిటీలోని 30 వార్డుల్లో ఒకే సారి 100 అభివృద్ధి పనులకు భూమి పూజ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని కమీషనర్‌ పావనితోపాటు ఇంజనీరింగ్‌ అధికారులను కోరినట్లు తెలిపారు. రూ. నాలుగు కోట్ల అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామ న్నారు. అనంతరం వార్డులోని పలు సమస్యలు కౌన్సిలర్‌ రణభేరి చిన్నం నాయుడు, ఎమ్మెల్యేకు వివరించారు.

అసెంబ్లీలో ప్రస్తావిస్తా

రానున్న అసెంబ్లీసమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు. శనివారం రాత్రి యూటీఎఫ్‌ నాయకులు మురళీమోహన్‌రావు, భాస్కరరావులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతపత్రాన్ని అందజేశారు.

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం

బెలగాం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. గత నెల 19 నుంచి 31 వరకు నియోజకవర్గంలో జరిగిన పశు వైద్య శిబిరాలపై పశువైద్యాధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.

Updated Date - Feb 01 , 2026 | 12:02 AM