పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:05 AM
పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు.
సాలూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం
సాలూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దివంగ నేత ఎన్టీఆర్ ఆశయమైన కూడు, గూడ, గుడ్డ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారన్నారు. నాణ్యమైన వేడి అన్నం, పప్పు, కూర, సాంబారు, పెరుగులతో కూడిన భోజనాన్ని రూ.5కే అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. అనంతరం పట్టణంలోని రామాకాలనీలో రూ.53 లక్షలతో నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ భవనాన్ని సోమవారం మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి చూసి...
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి నాయకులు, ప్రజలు ఈ పార్టీలో చేరుతున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని 23వ వార్డు రామాకాలనీలో సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మాజీ కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలో చేరారు. వారంద రికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కళ్ల శ్రీనివాసరావు, వాడాడ శోభారాణి, అప్పయ్యమ్మ, డబ్బి కృష్ణ, కేతిరెడ్డి చంద్రశేఖర్, ఆముదాల పరమేశ్ తదితరులున్నారు.