ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:39 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామ ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాదర్బార్
విజయనగరం రూరల్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యో తి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామ ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. విజయ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించి, నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇళ్లు మంజూరు చే యాలని, ఇంటి రుణాలు ఇప్పించాలని, ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పించాలని, సబ్సిడీ రుణాలు ఇప్పిం చాలని పలువురు వినతులు ఇచ్చారు. సమస్యల న్నిం టినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
భోగాపురం, సెప్టెంబరు 18(ఆం ధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి అన్నారు. ముంజేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రజా దర్బార్ నిర్వహించి.. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. నాయకులు పల్లంట్ల జగదీష్, వరుపుల సుధాకర్ పాల్గొన్నారు.
లక్కవరపు కోట, సెప్టెంబ రు 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని ఎమ్మెల్యే లలితకుమారి ఇంటి వద్ద శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. అయితే ఈ ప్రజాదర్బార్ లో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపైనే అత్యధిక దరఖా స్తులు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే స్వ యంగా అర్జీదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారా నికి ప్రయత్నించారు. మొత్తం 34 దరఖాస్తులు రాగా, అందులో 24 రెవెన్యూశాఖకు సంబంధించినవని తెలిపారు. జాగరం గ్రామంలో ఎస్సీ కాలనీలో వేంకటే శ్వరస్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు చేసి, వారి చిరకాల కోరి కను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, చిన్నబ్బి నాయుడు, శేఖర్, జాగరం పైడిబాబు పాల్గొన్నారు.
గరివిడి(చీపు రుపల్లి), సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజా సమ స్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కిమి డి కళావెంకటరావు అన్నారు. ఆయన శుక్రవారం చీపు రుపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వ హించి, ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. 30కి పైగా వినతులు వచ్చాయి. టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు పాల్గొన్నారు.