ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:55 PM
ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. ఆదివారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్ర మాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలపై ఎమ్మె ల్యేకు వినతిపత్రాలు అందజేశారు. అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, నాయకులు రాజేష, దొర బాబు, నాగేశ్వరరావు, మన్మఽథ తదితరులు పాల్గొన్నారు.