సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:11 AM
సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు.
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. కాగా అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతు న్న 27 కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.20.35 లక్షల విలువైన చెక్కులను పంపిణీచేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు డొంకాడ రామకృష్ణ, అంబటి రాంబాబు, మధుసూదనరావు, దత్తి లక్ష్మణరావు, రామారావు, కడ్రక కళావతి, రామారావు, అడ్డాకుల నరేష్, జోగి భుజంగరావు, కొండయ్య పాల్గొన్నారు.