Share News

పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యం

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:54 PM

చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా తగ్గించడమే బాలామృతం ప్లస్‌-2 లక్ష్యమని రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యం
బాలింతలకు కిట్లను అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా తగ్గించడమే బాలామృతం ప్లస్‌-2 లక్ష్యమని రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బాలామృతం ప్లస్‌-2 కార్యక్రమంలో భాగంగా పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం బాలింతలకు బాలామృతం ప్లస్‌-2 కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహార లోపం నివారణకు మహిళా, స్త్రీశిశు సంక్షేమ శాఖ మరో కీలక ముందడుగు వేసి బాలా మృతం ప్లస్‌-2 అమలుకు శ్రీకారం చుట్టింద న్నారు. విజయవాహిని చారిటబుల్‌ ఫౌండే షన్‌, టాటా ట్రస్టు సహకారంతో బాలామృ తం ప్లస్‌-2 అమలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా తిరుపతి, ఎన్టీఆర్‌ జిల్లా , పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 28 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించామ న్నారు. బాలా మృతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 350 కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్రంలో 55 వేల 678 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా లక్షా 25 వేల మంది సిబ్బంది అందులో పనిచేస్తు న్నారన్నారు. కార్యక్రమంలో స్టేట్‌ ప్రోగ్రాం అధికారి కె.ఎస్‌.సుబ్రహ్మణ్యం, ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ, సీడీపీవో మంగమ్మతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:54 PM