ఇంటింటికీ తాగునీటి కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:18 AM
ఇంటింటికీ సురక్షిత తాగునీ టి కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలి పారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు
రేగిడి, అక్టోబరు 11(ఆంధ్రజ్యో తి): ఇంటింటికీ సురక్షిత తాగునీ టి కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలి పారు. బాలికావలసలో జల జీవన్ మిషన్ అమరజీవి జల ధార పథకంలో భాగంగా మం జూరైన రూ.14.30లక్షల ఇంటింటి కుళాయి పనులను ఆయన ఆదివారం ప్రారంభించారు. టీడీపీ నాయకులు కోండ్రు జగదీష్, గురువాన నారాయణరా వు, దుప్పలపడి శ్రీనివాసరావు, దూబ ధర్మారావు, కిమిడి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల బాంధవుడు చంద్రబాబు..
రాజాం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): బీసీల బాంధవుడు సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి బీసీల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్ రావు, గురవాన నారాయణరావు, తుప్పలపూడి శ్రీనివాసరావు, వంగా వెంకటరావు, వల్లూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వం..
రాజాం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో తుఫాన్ ప్రభావంతో రాజాం నియోజకవర్గంలో వెయ్యి హెక్టార్ల వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని వంగర, రేగిడి, సంతకవి టి, రాజాం మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించి, రూ.5కోట్ల నిధులను మంజూరు చేసిందని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పనులు ఇప్పటికే జరుగుతున్నాయని తెలిపారు. ఎకరాకు రూ.7వేలు చొప్పున నష్ట పరిహా రం అందించనుందని చెప్పారు.