Share News

మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:22 AM

ప్రజలకు మెరుగైన సౌక ర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం
విజయనగరం టౌన్‌: అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, అదితిగజపతిరాజు

  • విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం టౌన్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సౌక ర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని వైఎస్సార్‌నగర్‌లో వీఎంఆర్‌డీఏ నిధులు రూ.44 కోట్లతో చేపట్టనున్నపనులకు ఎంపీ, ఎమ్మెల్యే బుధవారం శంకు స్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్దం చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఈఈ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

విజయనగరం సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిలోని సృజనాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించడమే యువజనోత్సవాల ప్రధాన లక్ష్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. బుఽధవారం విజయనగరంలోని మహారాజ అటానమస్‌ కళాశాలలో సెట్విజ్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవాలు- 2026ను ఆయన ప్రారంభిం చారు. జాతీయ స్థాయికి ఎంపికైన యువతకు ఢిల్లీలోని తన నివాశంలో ఆతిధ్యం ఇస్తానని తెలిపారు. కార్యక్రమంలో సెట్విజ్‌ సీఈవో వీవీ అప్పలనాయుడు, మైభారత్‌ యూత్‌ అధికారి భరత్‌కుమార్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ జి.గోపి, అంబేడ్కర్‌ యువజన సంఘం ప్రతినిధి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫవిజయనగరం రూరల్‌, సెప్టెంబరు 30(ఆంఽధ్రజ్యోతి): గ్రామీణప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. దుప్పాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవ్‌కా మిషన్‌ గ్రామీణ పఽథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి హామీ పఽథకం ద్వారా ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఏడు కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు.

Updated Date - Oct 01 , 2026 | 12:22 AM