Share News

భూసారాన్ని కాపాడటమే ధ్యేయం

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:36 AM

రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అధికారులను ఆదేశించారు.

భూసారాన్ని కాపాడటమే ధ్యేయం
మొక్క నాటుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జయకృష్ణ

పాలకొండ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం బుక్కూరులో నిర్వహించిన గట్టుమీద చెట్టు కార్యక్రమంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ భూములు గట్లుపై మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడవచ్చన్నారు. అలాగే నేలకోతను నివారించవచ్చునన్నారు. రైతులు కార్యక్రమంలో భాగస్వాములు కావాల ని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. ఇందులో అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు భాగస్వాములు కావాలన్నారు. పచ్చదనం పెంపొందిం చడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత న్నారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కర్నేన అప్పలనాయుడు, రైతులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:36 AM