మన్యంను నెంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:25 PM
పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలో నెంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలో నెంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతతో పనిచేసే ఇబ్బందులను అధిగమించ వచ్చని అన్నారు. అభివృద్ధి పనుల వియంలో పాలకపక్షం, అధకారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రజలకు సకాలంలో పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారులకు బదులు 1912 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఆశ్రయించం ద్వారా వేగవంతమైన ఫలితాలు పొందవచ్చునని తెలిపారు. ఏఈ లేదా ఇతర అధికారులకు సమాచారం ఇవ్వడం.. వారు స్పందించి చర్యలు తీసుకోవడం వంటి ప్రక్రియ వల్ల సమయం వృథా అయ్యే అవకాశం ఉందని, అదే 1912 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే అక్కడి నుంచి నేరుగా సంబంధిత సిబ్బందికి మెసేజ్ వెళ్లడం ద్వారా పనులు నిర్ణీత సమయంలోగా పూర్తవుతాయని అన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతుమాధవన్, జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.