Share News

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:14 PM

విశాఖ రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతల పరిర క్షణ, ప్రజలకు పారదర్శకమైన వేగవంతమైన పోలీసు సేవలను అందించడమే లక్ష్యమని విశాఖ ఐజీ గోపీనాథ్‌ జట్టీ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి

- ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తాం

- మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

- విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి

విజయనగరం, జూన్‌6 (ఆంధ్రజ్యోతి): విశాఖ రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతల పరిర క్షణ, ప్రజలకు పారదర్శకమైన వేగవంతమైన పోలీసు సేవలను అందించడమే లక్ష్యమని విశాఖ ఐజీ గోపీనాథ్‌ జట్టీ అన్నారు. శనివారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రేంజ్‌ పరిధిలోని విజయనగరం, పార్వతీ పురం మన్యం,శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో ఆయన సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత, సైబర్‌ నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక చర్యలు చేప ట్టాలని ఆదేశించారు. మహిళలపై జరిగే నేరా లకు సంబంధించిన కేసుల దర్యాప్తును వేగవం తం చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యా యం జరిగేలా చూడాలని ఆదేశించారు. మహిళల రక్షణ విఝయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. 2023 కంటే ముందు నమోదై, నేటికి దర్యాప్తులో ఉన్న కేసులు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల ఆలస్యానికి కారణాలను విశ్లేసించి వాటిని త్వరతిగతిన ముగించాలని అన్నారు. సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లిన సైబర్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్టుల కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. సోషల్‌ మీడియా నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి అక్రమ రవాణా చేసే 15మంది నేరస్తులకు చెందిన రూ.9,45,10,321 విలువైన ఆస్తులను గుర్తించి ప్రజల సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 06 , 2026 | 11:14 PM