Share News

Groundwater Levels భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:56 PM

The Goal is to Increase Groundwater Levels జిల్లాలో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని, భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని చెరువులన్నీ వందశాతం నిండేలా చూడాలన్నారరు. సోమవారం తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

  Groundwater Levels భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని, భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని చెరువులన్నీ వందశాతం నిండేలా చూడాలన్నారరు. సోమవారం తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. భూగర్భ జలాల పెంపునకు ఆక్విఫర్‌ మ్యాపింగ్‌ కీలకమన్నారు. సగటు భూగర్భ జలమట్టాన్ని మూడు మీటర్ల స్థాయికి తీసుకురావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. బోర్లు, బావులను పరిశీలించి భూగర్భ జలాల లోతును నమోదు చేయాలని ఆదేశించారు. జలాశయాల నీటిని పైపులైన్ల ద్వారా నేరుగా రైతులకు సరఫరాచేసే విధానం అత్యంత ప్రయోజనకమన్నారు. గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని ప్రోత్సహించి గ్రామాలకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పది వేల ఎకరాల్లో ఔషధ మొక్కల పెంచాలని సూచించారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. వసతిగృహాలు, పాఠశాలల ప్రాంగణాలను పచ్చదనంతో నింపాలన్నారు. పామాయిల్‌, కొబ్బరి, జీడిమామిడిపై దృష్టి సారించాలని, నర్సరీలు ఏర్పాటు చేసి నీటి వసతులు కల్పించాలని ఆదేశించారు. జనగణన-2027 పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈనెల 10 నుంచి 19 వరకు ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ, 20 నాటికి ఎన్యూమరేషన్‌ బ్లాకుల ఏర్పాటు, 21 నాటికి సూపర్‌వైజరీ సర్కిళ్ల రూపకల్పన, 23 నాటికి సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని తెలిపారు.

Updated Date - Nov 09 , 2026 | 11:56 PM