Share News

భూగర్భ జలం పెంపే లక్ష్యంగా..

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:20 AM

భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నీటి భద్ర త-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని చేపడు తోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.

భూగర్భ జలం పెంపే లక్ష్యంగా..

  • నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత

  • కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు, నాయకులు

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నీటి భద్ర త-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని చేపడు తోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. ద్వార పూడిలోని ఈశ్వరచెరువులో ఆమె సోమవారం ఈ కా ర్యక్రమాన్ని ప్రారంభించారు.

లక్కవరపుకోట, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కూటమి ప్ర భుత్వ లక్ష్యమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం కొట్యాడ గ్రామంలో ఆమె జల ధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊర చెరువులో కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ చొక్కా కుల మల్లునాయుడు, పీఏసీఎస్‌ అధ్యక్షులు మరోతి రామారావు, కోళ్ల శ్రీను, కొల్లు రమణమూర్తి, భూపాల్‌ నాయుడు పాల్గొన్నారు.

గంట్యాడ, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జాలాల స్థాయిని గణనీయంగా పెంచ వచ్చని డీసీసీబీ చైర్మన్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. సోమవారం నరవ గ్రామంలో ఆ యన నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్య క్రమాన్ని ప్రారంభించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌నాయుడు, తాటిపూడి ప్రాజెక్టు చైర్మ న్‌ కె.జగన్నాథం, నీటి పారుదల శాఖ అధికారులు పా ల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:20 AM