Share News

కలప కొరత లేకుండా చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:12 AM

బొబ్బిలి వీణల కళాకారులకు ముడిసరుకు కలప కొరతలేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్య మని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. శ

కలప కొరత లేకుండా చేయడమే లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన:

బొబ్బిలి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి వీణల కళాకారులకు ముడిసరుకు కలప కొరతలేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్య మని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. శనివారం పట్టణంలోని గొల్లపల్లి వీణల తయారీ కేంద్రంలో క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీశాఖాఽధికారులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆరు హస్తకళలకు సంబం ధించిన కళాకారులతో వర్చ్యువల్‌సమావేశం నిర్వహించి ఆయా ఉత్ప త్తులను ప్రదర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడు తూ పనస కలప లభ్యత లేక కళాకారులు అవస్థలుపడుతున్న విష యాన్ని గమనించి అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ స్పందించి వీణల తయారీదారులకే కాకుండా రాష్ట్రం లోని ఇతర హస్త కళాకారులకు అవసరమైన కలపను అందుబాటులో ఉంచేందుకు క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులను మంజూరు చేయడం ఎంతో సంతో షకరమన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ కన్జర్వేటరు ఐకేజీ రాజు, జిల్లా అటవీశాఖాధికారి ఎం.శ్యామసుందరం, బిర్లంగి రామ్‌నరేశ్‌, డిప్యూటీ రేం జ్‌ ఆఫీసరు రాజగోపాలరావు, గార్డు స్వప్న, గిరడ అప్పలస్వామి, పెంట స్వామినాయుడు, లంక రమేష్‌, లేపాక్షి మేనేజరు కార్తీక్‌, వీణల కేంద్రం ఇన్‌చార్జి సర్వసిద్ది రామకృష్ణ పాల్గొన్నారు.

22 మందికి సీఎంసహాయనిధి చెక్కుల పంపిణీ

నియోజకవర్గ పరిధిలోని 22 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.28,23,860లు మంజూరు కాగా బొబ్బిలి కోటలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీనాయన ఆ చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు.

ఫబాడంగి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): తెంటు జయప్రకాష్‌ సేవలు గొప్పవని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. శనివారం తెర్లాం ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు తెంటు జయప్రకాష్‌ జయంతిని నిర్వహిం చారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, వైస్‌ ఎంపీపీ గౌరి, మాజీ ఎంపీపీ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:12 AM