రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:20 AM
పీవీటీజీ గిరిజన గ్రామాల్లో సమగ్ర వ్యవ సాయ విధానాలు అమలుచేసి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పార్వతీపురంలో మన్యం అగ్రి క్లినిక్‌ను ప్రారంభిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిసేద్యం, జలసంరక్షణ, డిజిటల్ వ్యవసా యం, సేంద్రీయఎరువుల వినియోగంతోపాటు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్ పాల్గొన్నారు.
పార్వతీపురం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పీవీటీజీ గిరిజన గ్రామాల్లో సమగ్ర వ్యవ సాయ విధానాలు అమలుచేసి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పార్వతీపురంలో మన్యం అగ్రి క్లినిక్‌ను ప్రారంభిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిసేద్యం, జలసంరక్షణ, డిజిటల్ వ్యవసా యం, సేంద్రీయఎరువుల వినియోగంతోపాటు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్ పాల్గొన్నారు.
పోలింగ్‌స్టేషన్ల తుది ప్రచురణ పూర్తి
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలు, షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల తుదిజాబితా ప్రచురణ ప్రక్రియ సోమవారం పూర్తిచేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 451 పంచాయతీలకు సంబంధించి 4,144 పోలింగ్‌స్టేషన్ల తుది జాబితా ప్రచురించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వినికిడి పరికరాలు పంపిణీ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినికిడి లోపంతో బాధపడుతున్న ముగ్గురికి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సోమవారం వినికిడి పరికరాలను అందించారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ధర్మరాజు, డీఆర్‌డీఏ పథక సంచాలకులు ప్రభావతి, వికలాంగుల సంక్షేమశాఖ అధికార ప్రతినిధి రమణ పాల్గొన్నారు.
వర్చువల్ తనిఖీలు ప్రారంభించాలి
వర్చువల్ తనిఖీలతో క్షేత్రస్థాయి పాలనలో పారదర్శకత పెరిగి మెరుగైన ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, మంగళవారం నుంచి మునిసిపాలిటీల్లోను వర్చువల్ తనిఖీలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.