ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:30 AM
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఎంపీ కలిశెట్టి
పీఎం-వీబీఆర్‌వై పథకం ప్రారంభం
విజయనగరం కలెక్టరేట్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం వీబీఆర్‌వై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ నుంచి దేశ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాల ను డీబీటీ ద్వారా విడుదల చేశారు. ఈసందర్భంగా విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. యువత ఉద్యోగాలు పొందడమే కాకుం డా.. ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగా లన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో ఉద్యోగా లకు ఎంపికైన యువతి, యువకులకు ఆయన నియా మక పత్రాలు అందజేశారు. ప్రాంతీయ ఈపీ ఎఫ్‌వో కమిషనర్ కణితి అవినాష్ కుమార్, జిల్లా పరిశ్రమల మేనేజరు కరుణాకర్ పాల్గొన్నారు.