మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:09 AM
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మంగళవారం మండలంలోని కందివలస, కంబవలసల్లో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు వల్ల ప్రజల స్థితిగతులు మారుతాయన్నారు. కందివలసలో శ్మశానానికి దారిలేకపోవడంతో ప్రస్తుతం నిర్మించిన సీసీ రోడ్డు వల్ల పొలాలు, శ్మశానానికి వెళ్లేందుకు ఉపయో గపడుతుందన్నారు.
ప్రభుత్వ విప్ జగదీశ్వరి
కొమరాడ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మంగళవారం మండలంలోని కందివలస, కంబవలసల్లో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు వల్ల ప్రజల స్థితిగతులు మారుతాయన్నారు. కందివలసలో శ్మశానానికి దారిలేకపోవడంతో ప్రస్తుతం నిర్మించిన సీసీ రోడ్డు వల్ల పొలాలు, శ్మశానానికి వెళ్లేందుకు ఉపయో గపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండ లాధ్యక్షుడు శేఖర్‌పాత్రుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ గార గౌరీశంకర్, కూటమి నాయకులు గులిపల్లి సుదర్శనరావు, నంగిరెడ్డి మధుసూదనరావు, వెంకట్‌నాయుడు, తిరుపతిరావు, కృష్ణంనాయుడు, తెంటు శ్రీకర్, లక్ష్మణరావు, సురేష్, రాఘవ, హరి ప్రసాద్ పాల్గొన్నారు.
రేగాలమ్మకు పూజలు
గరుగుబిల్లి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలం లోని చిలకాంలో నిర్వహిస్తున్న రేగాలమ్మ గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా కురుపాం, పార్వతీపురం ఎమ్మె ల్యేలు తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర పూజ లుచేశారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియో జకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తేజోవతి, పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి, ఎంపీపీ ఉరిటి రామారావు, టీడీపీ మండలాధ్యక్షుడు మరడాన నారాయణస్వామి, నాయకులు సత్యనారా యణ, ద్వారపురడ్డి శ్రీనివాసరావు, ఎం.తవిటినా యుడు, ఎం.పురుషోత్తంనాయుడు పాల్గొన్నారు.