Share News

నేరాల నియంత్రణే లక్ష్యం

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:51 PM

ప్రజల భద్ర త, నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపా రు.

నేరాల నియంత్రణే లక్ష్యం

  • బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి

దత్తిరాజేరు, ఫిబ్రవరి 22(ఆంధ్ర జ్యోతి): ప్రజల భద్ర త, నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపా రు. పెదమానాపురం పోలీసుస్టేషన్‌ను ఆమె ఆదివా రం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు బొబ్బిలి సబ్‌ డివిజన్‌ పరిధిలోని బొబ్బిలిలో తారకరామాకాలనీ, పెదమానాపురం పోలీ సుస్టేషన్‌ పరిధిలోని ఇంగిలాపల్లి గ్రామాల్లో ఆదివారం పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చామని చెప్పారు. బొబ్బిలి, గజపతినగరం సర్కిల్‌ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు వందమం ది బృందాలుగా ఏర్పడి ఆకస్మి కంగా సోదాలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించడంతోపాటు వారి ము ద్రలను ఎంఎన్‌సీడీ పరికరాలతో తనిఖీలు చేశామని చెప్పారు. ఈ తనిఖీల్లో రికార్డులు సక్రమంగా లేని 25 ద్విచక్రవాహనాలను స్టేషన్‌కు తరలించామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఆపరే షన్‌ అకస్మాత్తుగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ దాడుల్లో బొబ్బిలి, గజపతినగరం సీఐలు కె.నారాయ ణరావు, జీఏవీ.రమణ, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామ భద్రపురం, బొండపల్లి, ఆండ్ల, పెదమానాపురం ఎస్‌ఐ లు రమేష్‌, తారకేశ్వరరావు, సాగర్‌బాబు, వి.ప్రసాద్‌, మహేష్‌, సీతారాం, జయంతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:51 PM