Share News

పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:20 AM

పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. యువత పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి: కలెక్టర్‌

పార్వతీపురం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. యువత పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. శనివా రం పార్వతీపురం కలెక్టరేట్‌లో టొబాకో ఫ్రీ యూత్‌ క్యాంపెయిన్‌ 4.0 కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తు లకు అలవాటు పడకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొనేలా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేకంగా 60 రోజుల పాటు గ్రామాలు, పాఠశాలలు, కళా శాలల్లో వివిధ అవగాహనా కార్య క్రమాలు చేపట్టాలన్నారు. ఈ సంద ర్భంగా యువత ప్రపంచం 4.0 గోడపత్రికను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి విజయలక్ష్మి, నోడల్‌ అధి కారి జగన్మోహన్‌రావు, ప్రోగ్రాం అధికారులు విజయమోహన్‌, రవికు మార్‌, కౌశిక్‌, భవానీ, కృష్ణారావు, ప్రసాద్‌, గిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:20 AM