పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:59 PM
పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆదివారం జిలాలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆదివారం జిలాలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఫబెలగాం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, చిన్నారులు ఆరోగ్యమే ధ్యేయమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పార్వతీపురంలోని డీవీఎంఎం పాఠశాలలో కలెక్టర్ ప్రభా కర్‌రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాటా ్లడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సేవలు అందించాలని ఆదేశించారు. ఆదివానం పోలియో కేం ద్రాల వద్ద ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కలు వేయగా, సోమ, మంగళవారాల్లో కార్యకర్తలు ఇంటింటా తిరిగి మిగిలిపోయిన చిన్నారులు గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. జిల్లాలో 99,507 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 2,48,524 గృహాలను సందర్శిస్తామని వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మాధురి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫగుమ్మలక్ష్మీపురం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాల యంలో పల్స్‌పోలియో కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈసందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి చిన్నారులకు పోలియో చుక్కలువేశారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారులు నిండు నూరేళ్లు ఆరోగ్యవంతమైన జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమైనవన్నారు తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియోచుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజ యవం తం చేయాలన్నారు. కార్యక్రమంలో తాడికొండ వైద్యాధికారి ఎం.బుద్దేశ్వరరావు, నియో జకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు చిన్న, రాజేష్, రామారావు, మన్మధ, శివ తదితరులు పాల్గొన్నారు.
ఫబెలగాం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. పార్వ తీపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుప త్రిలో పల్స్ పోలియో కార్య క్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్య క్రమంలో డీసీహెచ్ నాగభూషణరావు పాల్గొన్నారు.
ఫపాలకొండ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సచివాలయాలు, ఆసుప త్రులు, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను నగర పంచాయతీ కమిషనర్ పీవీ నూకరాజు పర్యవేక్షిం చారు. చుక్కలు వేయని వారికి సోమ, మంగళవారాల్లో సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వేయనున్నట్టు పేర్కొన్నారు.