‘ఏజెంట్ల హక్కుల సాధనే ధ్యేయం’
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:03 AM
ఎల్‌ఐసీ అభివృద్ధిలో ఏజెంట్ల పాత్ర కీలకమని, వారి హక్కుల సాధనే ధ్యేయమని, సంక్షేమం, వృత్తి భద్రత కోసం ఏజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) నిరంతరం పోరాడుతోందని రాష్ట్ర అధ్యక్షుడు పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.
గరివిడి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఐసీ అభివృద్ధిలో ఏజెంట్ల పాత్ర కీలకమని, వారి హక్కుల సాధనే ధ్యేయమని, సంక్షేమం, వృత్తి భద్రత కోసం ఏజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) నిరంతరం పోరాడుతోందని రాష్ట్ర అధ్యక్షుడు పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం గరివిడిలో నిర్వహించిన ఎల్‌ఐసీ విశాఖ డివిజన్ స్థాయి ఈసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ డివిజన్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.నాగరాజు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఏఓఐ రాష్ట్ర కార్యదర్శి రవికిశోర్,విశాఖ డివిజన్ కార్యదర్శి ఎన్‌ఆర్.ఠాగూర్, జిల్లా అధ్యక్షుడు డీవీఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి రామారావు, సీడబ్ల్యూసీ మెంబర్ రామకృష్ణ, గరివిడి బ్రాంచి అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు నారాయణరావు, కార్యదర్శి కోరాడ నారాయణరావు పాల్గొన్నారు.