Share News

శతశాతం ఫలితాల సాధనే ధ్యేయం

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:06 AM

జిల్లాలో అన్ని జడ్పీ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉతీర్ణత సాధించే ధ్యేయంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కేవీ రమణ తెలిపారు.

శతశాతం ఫలితాల సాధనే ధ్యేయం
విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో రమణ

వేపాడ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని జడ్పీ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉతీర్ణత సాధించే ధ్యేయంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కేవీ రమణ తెలిపారు. బుధవారం మండలంలోని వావిలపాడు, నీలకంఠరాజపురంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు నాగభూషణరావు, బాలభాస్కరరావు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు శ్రీనివాసరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:06 AM